| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | అపార కృపానిధివని నీనామ |
| జ్ఞానానందవర్ధని - ఆది | |
| పల్లవి: | |
| అపార కృపానిధివని నీనామ మేపార నామది నుపాసింతునే అంబ | ॥అపార॥ |
| అనుపల్లవి: | |
| కపాలశంఖచక్రగదాంకుశ ఖడ్గధారిణి మాపాలి దైవమా శ్రీ మహేశ్వరి గాయత్రి | ॥అపార॥ |
| చరణము(లు): | |
| సనాతనీ సచ్చిదానంద రూపిణి శ్రీనాథానంద సద్గురు తీర్థోపాసిని అనాదిగా హరిహరాది సురలెల్ల ఘనాభి నుతులిడరె జ్ఞానానంద తీర్థార్చిత | ॥అపార॥ |