| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | పరశివ సుదతీ పార్వతీ నీ |
| పూర్వీకల్యాణి - ఆది | |
| పల్లవి: | |
| పరశివ సుదతీ పార్వతీ నీ పదయుగ సేవాసక్తి గల నిజభక్తి నిడి బ్రోవవే | ॥పర॥ |
| అనుపల్లవి: | |
| ధర నరుదై దొరకు ఈ నరజన్మమందే దృఢ తరముగ నామది రంజిల్ల నిష్కామ భక్తితో నిను సేవింతు | ॥పర॥ |
| చరణము(లు): | |
| తీరని భవ భారముచే ఈ భువి నిజ దారసుత ధనయశోకాముడనై బరగి ఏదారి దోచక నీదరి చేరి వేడితి జగత్ కారిణి భవతరణి జ్ఞానానంద తీర్థార్చిత | ॥పర॥ |