| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | ఏమి కావలెనే మనసా భువి శివ |
| కేదారగౌళ - ఆది | |
| పల్లవి: | |
| ఏమి కావలెనే మనసా భువి శివ కామినీ మది పదకంజ భక్తి కన్నా మన | ॥కేమి॥ |
| అనుపల్లవి: | |
| కామితార్థ ఫలము లేకాల మొసగు ప్రేమరూపిణి జనపెన్నిధిగా మన | ॥కేమి॥ |
| చరణము(లు): | |
| వేదశాసనాను వర్తనులై విధిహిత కర్మాచరణముచే కర్మశీలుడై మోదమలర పరతత్త్వోపాసన చేయు శ్రీ దేవీగానసుధాపాన మత్తచిత్తుల కిక | ॥నేమి॥ |