కీర్తనలు శ్యామా శాస్త్రి ఓ జగదంబ నను అంబ నీవు జవమున బ్రోవు అంబ
ఆనందభైరవి - ఆది
పల్లవి:
ఓ జగదంబ నను అంబ నీవు జవమున బ్రోవు అంబ॥
అను పల్లవి:
ఈ జగతి గతియై జనులకు మరి తేజమున రాజవినుతయౌ
రాజముఖి సరోజనయన సుగుణ రాజరాజిత కామాక్షి॥
చరణము(లు):
కన్నతల్లి నాదు చెంతనెంత కన్నడ సలుపగ తగునా
నిన్ను నే నమ్మియున్నవాడగదా నన్నొకని బ్రోచుటకరుదా?
అన్ని భువనంబుల గాచేవు ప్రసన్నమూర్తి అన్నపూర్ణ వరదా
విన్నపంబు విన్నవించి సన్నిధి విపన్న భయ విమోచన ధౌరేయ॥
జాలమేల శైలబాల తాళ జాలను జననీ నిన్నువినా
పాలనార్థముగ వేరే దైవముల లోలమతియై నమ్మితినా?
నీలనుతా శీలమునెచ్చటనైన గాన గానలోల హృదయా
నీలకంఠరాణి నిన్నునమ్మితిని నిజంబుగ బలికేది దయచేసి॥
చంచలాత్ముడేను యేమిపూర్వ సంచితముల సలిపితినో?
కంచికామాక్షి నేను నిన్ను పొడ గాంచితిని శరణు శరణు నీ
వించుకా చంచలగతి నా దెస నుంచవమ్మా శ్యామకృష్ణ వినుతా
మంచి కీర్తినిచ్చునట్టి దేవి మన్నించి నాదపరాధముల సహించి॥
స్వరము(లు):
వరసితగిరి నిలయుని ప్రియ ప్రణయిని పరాశక్తి మనవిని వినుమా
మరియాదలెఱుగని దుష్ప్రభుల కోరి వినుతింపగ వరంబొసగు॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - O jagadaMba nanu aMba nIvu javamuna brOvu aMba