కీర్తనలు శ్యామా శాస్త్రి కరుణజూడవమ్మా వినమ్మా
వరాళి - మిశ్ర చాపు
పల్లవి:
కరుణజూడవమ్మా వినమ్మా శ్రితజనకల్పవల్లీ మాతల్లీ॥
అను పల్లవి:
మరకతాంగి పంచనదేశురాణి మధురవాణి ధర్మసంవర్ధని॥
చరణము(లు):
నరాధములను మహారాజులని పొగడి దురాశచే తిరిగి వేసారి ఇలలో
విరాజముఖి నీవు దయతో కాపాడి బిరాన వరమీయవే గిరిరాజసుతా నీవు॥
ఉమా భువిని నీకు సమానమెవరు? భారమా రక్షించుటకు అభిమానములేదని
కుమారుడుగదా నాకిపుడు అభయమీయవే కుమారజనని నీవు మానవాతీత గదా॥
ఉదారగుణవతిగదా సామగాననుతా సదా నుతిజేరి నీ పదాంబుజముల
ను దాసుని మొఱ వినవా సమయమిదే సదాశివుని రమణీ దీనజనాశ్రితే॥
ఉదారముగను అవతారమెత్తి జగమును సుధాకరునివలె రంజింపజేయు నీ
పదాంబుజమును నమ్మి నిన్నే భజించి సదా శ్యామకృష్ణ జేసిన భాగ్యమే॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - karuNajUDavammA vinammA