కీర్తనలు శ్యామా శాస్త్రి కరుణానిధి ఇలలో నీవనుచును
తోడి - ఆది, తిశ్ర గతి
పల్లవి:
కరుణానిధి ఇలలో నీవనుచును
కన్నతల్లీ వేడుకొంటిని నీ శరణంటిని॥
అను పల్లవి:
అరుణాంబుద నిభచరణా సురముని
శరణానంతేష్టదాయకి శ్రీ బృహన్నాయకి॥
చరణము(లు):
గానవినోదిని నీమహిమాతిశయంబుల
ఎంతటివాడను తరమా బ్రోవ
తామసమిటు జేసితే అరనిమిషమైన తాళజాలనమ్మా
మాయమ్మా నేడు నీ బాలుడను గాన॥
పామరపాలిని పావని నీవు గదా
నీ పాదమే గతియని నమ్మినాను
కోమల మృదు భాషిణీ ఘనసదృశవేణీ
శ్యామకృష్ణసోదరి గోకర్ణేశ్వరుని రాణి॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - karuNAnidhi ilalO nIvanuchunu