కీర్తనలు శ్యామా శాస్త్రి కామాక్షి బంగారు కామాక్షి నన్ను బ్రోవవే
వరాళి - మిశ్ర చాపు
పల్లవి:
కామాక్షి బంగారు కామాక్షి నన్ను బ్రోవవే॥
అను పల్లవి:
తామసమేల రావే సామగానలోలే సుశీలే॥
చరణము(లు):
కామకాల ప్రియభామినీ కామ్య కామదే కల్యాణీ
కామాక్షీ కంజదళాయతాక్షీ త్రికోణవాసినీ కారుణ్యరూపిణి॥
పావనీ మృదుభాషిణీ భక్తపాలినీ భవమోచనీ
హేమాంగీ హిమగిరిపుత్రీ మహేశ్వరీ హ్రీంకార రూపిణీ॥
శ్యామకృష్ణపరిపాలినీ శుకశ్యామళే శివశంకరీ
శూలినీ సదాశివునికి రాణీ విశాలాక్షతరుణీ శాశ్వతరూపిణీ॥
స్వరము(లు):
నా మనవిని విను దేవీ నీవే గతియని నమ్మినాను
మాయమ్మా వేగమే కరుణ జూడవమ్మా బంగారుబొమ్మా॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - kAmAkShi baMgAru kAmAkShi nannu brOvavE