కీర్తనలు శ్యామా శాస్త్రి జనని నతజనపరిపాలిని పాహిమాం భవాని త్రిలోక
సావేరి - ఆది
పల్లవి:
జనని నతజనపరిపాలిని పాహిమాం భవాని త్రిలోక॥
అను పల్లవి:
దనుజవైరినుతే సకలజన పరితాప పాపహారిణి జయశాలిని॥
చరణము(లు):
సతతవినుత సుతగణపతి సేనాని రాజరాజేశ్వరి
విశాలాక్షతరుణి అఖిలజనపావని శ్రీ రాజరాజేశ్వరి
సతి శుభచరితే సదా మధుర భాషా విగళదమృతరసధ్వని
సురనుత పదయుగ దర్శిత ఇహ మమ గాత్రమతిమాత్రమజని సుజని॥
కువలయ లోచనయుగళే కల్యాణి నీలవేణి
వికచకోకనద రజచ్చరణే అతిరమణి ఘననీలవేణి
భువి దివి రక్షణి దృతామరగణే భాగ్యవతి శక్తిసంపూర్ణే
కవన నిపుణమతిం అయి దిశ ఇహ తవ కాంతిముపయాతుం గిరీశ రమణి॥
చరణనిపతదమరసముదయే కాళి సారసముఖి
సుశోభితోరుయుగళ వరకదళినవ సారసముఖి
సురుచిర మురళీ మృదంగస్వరసంశోభిని రసకృత మహీతలే
సరసిజకరయుగళే కటికలిత మణి కాంచీభృతే కాంచీపురవాసిని॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - janani natajanaparipAlini pAhimAM bhavAni trilOka