కీర్తనలు శ్యామా శాస్త్రి తల్లి నిన్ను నెఱ నమ్మినాను వినవే
కల్యాణి - మిశ్ర చాపు
పల్లవి:
తల్లి నిన్ను నెఱ నమ్మినాను వినవే॥
అను పల్లవి:
ఎల్లలోకముల కాధారమైయున్న నా॥
చరణము(లు):
ఆదిశక్తి నీవు పరాకుసేయకు ఆదరించుటకిది మంచిసమయము
గదా సరోజభవాచ్యుత శంభునుతపదా నీదు దాసానుదాసుడౌ నా॥
దేవి నీదు సరిసమానమెవరని దేవరాజమునులు నిన్ను పొగడగ
నా వెద దీర్చి బిరాన వరాలొసగి నన్నుబ్రోవ నీ జాలమేలనే॥
శ్యామకృష్ణ పరిపాలినీ జననీ కామితార్థప్రదా పంకజలోచని
కౌమారీ రాణీ పురాణీ పరాశక్తి కామకోటి పీఠవాసినీ॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - talli ninnu neRa namminAnu vinavE