కీర్తనలు శ్యామా శాస్త్రి త్రిలోకమాతా నన్నుబ్రోవు కరుణను
పరజు - మిశ్ర చాపు/ఆది
పల్లవి:
త్రిలోకమాతా నన్నుబ్రోవు కరుణను దినదినమికను బ్రోవుము అంబా॥
అను పల్లవి:
విలోకింపుము సదయ నన్ను చల్లని వీక్షించి క్షణమున కామాక్షి॥
చరణము(లు):
నిన్ను నమ్మియుండగ శ్రమపడవలెనా నేనెందు గాన దిక్కు నిన్నువినా
ఘనముగా కోరికల కోరి కోరియేమి గానగ ఖిన్నుడనైతి ధన్యుజేసి॥
జపములెఱుగను తపములెఱుగను చపలచిత్తుడను సతతము కృపకు
పాత్రుడను వేడెదను నిను కీర్తించి యెట్లైన నీ బిడ్డయని॥
మరువక నిను నే మది దలచగను మన్నించి వెరవకు మనరాదా?
శరణనే సుజనుల పాలి కల్పవల్లి శంకరీ శ్యామకృష్ణసోదరీ॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - trilOkamAtA nannubrOvu karuNanu