కీర్తనలు శ్యామా శాస్త్రి దురుసుగా కృపజూచి సంతత
సావేరి - ఆది
పల్లవి:
దురుసుగా కృపజూచి సంతత మరోగ దృఢ శరీరముగ సలుపు నను॥
అను పల్లవి:
పరమ పావని కృపావని వినుత పదసరోజ ప్రణతార్తిహరు రాణి
పరాకు ధర్మసంవర్ధని బహు పరాకమలగుణా త్రిపురసుందరి॥
చరణము(లు):
నీ సన్నిధినిజేరి గొలిచిన నిన్నెపుడు దలచెడు సుజన
దాసజన భాగ్యమెటు దెలుపుదునో
ఓ సకలపాపశమనీ విను ఓంకారి, నియతి యెటులనో?
నీసాటెవరే జగంబులను నే నిరతము నిను గొలిచితి॥
ఏమో కలకచెంది మనమున నే నెచ్చట గతి గానకను
నీ మహిమలెల్ల చెవులారగ విని
ఈ మనసులోని వెత దీర్చుట కీ వేళ బహు నిపుణవని
కామాక్షీ నీవే వేరెవరు కాదని దలచి గొలిచితిని॥
ధారాధర వినీలకచలసితా సరస కవితా నిచితా
సారఘనసార సిత దరహసితా
వారిరుహవారి వదనోచితా వాగీశ వినుతా భృతనతా
నారాయణి శ్యామకృష్ణ వినుతా నా మనవిని విను గిరిసుతా॥
స్వరము(లు):
సరోజనయన నతజనపాలినివని వేదములు మొఱలిడగా
నితరులెవరు మనవి విను కృపసలుప పరాకు సలుపరాదిక నీవిపుడు॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - durusugA kR^ipajUchi saMtata