కీర్తనలు శ్యామా శాస్త్రి దేవి మీన నేత్రి బ్రోవ రావే
శంకరాభరణం - ఆది
పల్లవి:
దేవి మీన నేత్రి బ్రోవ రావే
దయచేయవే బ్రోవరావమ్మా॥
అను పల్లవి:
సేవించేవారికెల్లను చింతామణియై యున్న॥
చరణము(లు):
బాల నీవే గతియని నిన్నే చాలా నమ్మిన నాపై పరా
కేలా దయచేయ నీకిది మేలా దివ్యాంబా
కాలాది విరాణీ సద్గుణశీలా కీరవాణీ దేవీ
నీల నీరదవేణి త్రిలోక జననీ దేవీ మహేశ్వరీ భవానీ॥
అంబా ముఖనిర్జిత శతధరబింబా రక్షితదేవదాత
వమ్మా నత నిజసుత గుహ హేరంబాంబా శ్యామళాంబా
బింబాధరి గౌరి కాదంబ విహారి అంబ
కంబుకంఠి హిమశైల వృక్ష పాలికా దేవి బాలాంబికా అంబా॥
వాణీ రమా వందిత రుద్రాణీ నీసాటెవరు క
ల్యాణి శ్యామకృష్ణనుతా కీరవాణీ శర్వాణీ
వీణావినోదిని శ్రీ చక్రకోణ నివాసిని గీ
ర్వాణ వందిత పదారవిందా శివా దేవీ కాత్యాయని॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - dEvi mIna nEtri brOva rAvE