కీర్తనలు శ్యామా శాస్త్రి దేవీ నన్ను బ్రోవవమ్మా ఇపుడే మంచి సమయమమ్మా
కల్యాణి - ఝంప
పల్లవి:
దేవీ నన్ను బ్రోవవమ్మా ఇపుడే మంచి సమయమమ్మా॥
అను పల్లవి:
సేవించి నిన్నే సదా నమ్మితిని నిరతముగ నమ్మితిని॥
చరణము(లు):
అనాథరక్షకి బిరానబ్రోవుము తల్లి ఆశ్రితజనపాలిని భవాని దేవి త్రిలోకజనని॥
పరాకుసేయక వరాలొసగుము తల్లి పామరజనపాలిని మృడాని దేవి త్రిలోకపాలిని॥
కుమారజనని కటాక్ష సేయుము తల్లి శ్యామకృష్ణపాలిని పురాణి దేవి బృహదంబా॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - dEvI nannu brOvavammA ipuDE maMchi samayamammA