కీర్తనలు శ్యామా శాస్త్రి దేవీ నీ పాదసారసములే దిక్కు
కాంభోజి - ఆది
పల్లవి:
దేవీ నీ పాదసారసములే దిక్కు వేరేగతియెవరమ్మా నా॥
అను పల్లవి:
శ్రీవెలయు మధుర నెలకొన్న చిద్రూపిణి శ్రీ మీనాక్షమ్మా॥
చరణము(లు):
అనాథరక్షకియనేటి బిరుదు నీ కనాది గదా లో
కనాయకి ధరలో కృపానిధి నీకన్నా యెవరమ్మా మాయమ్మా యి
కన్నాకు భవలతాలవిత్రి నాపై కటాక్షించవె వేగమే
చిన్న వెతలు నీవు దీర్చి నన్ను రక్షించుటకిది మంచి సమయమమ్మ॥
కదంబకానన మయూరీ నీవే కదంబా శంకరీ చం
డ దానవమద ఖండితా మృడానీ శుకపాణీ కల్యాణీ
సదా నీ ధ్యానముసేయువారికి గదా సామ్రాజ్యము
చిదానందరూపుడైయున్న శ్రీ సదా శివుని రాణీ మధురవాణీ॥
ఉమా రమా శ్యామకృష్ణనుతా గిరికుమారీ నీ
సమానమెవరు బ్రోవ నీకు భారమా జగత్సాక్షీ మీనాక్షీ
తామసము జేసితే నీకిది న్యాయమా ఇంత జాగేలనే?
వేమారు నీపాదదర్శనము లభించి నీ మాటలు వినగ వచ్చితినమ్మా॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - dEvI nI pAdasArasamulE dikku