కీర్తనలు శ్యామా శాస్త్రి నన్ను బ్రోవరాదా ఓ జగదంబా నీ దయచేయవే
జనరంజని - త్రిపుట
పల్లవి:
నన్ను బ్రోవరాదా ఓ జగదంబా నీ దయచేయవే॥
అను పల్లవి:
కన్నతల్లి నీవే అంబా నా మొఱలను వినరాదా॥
చరణము(లు):
ఆదిశక్తి మహేశ్వరీ కౌమారీ ఆదరింపవే వే వేగమే నీలాయతాక్షీ భవానీ॥
కోమలమృదువాణీ కల్యాణీ సోమశేఖరుని రాణీ లలితాంబికే వరదే॥
శ్యామకృష్ణసహోదరీ ఓంకారీ శాంభవీ ఓ జననీ నాదరూపిణీ నళినాక్షీ॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - nannu brOvarAdA O jagadaMbA nI dayachEyavE