కీర్తనలు శ్యామా శాస్త్రి నన్ను బ్రోవు లలితా వేగమే చాల
లలిత - మిశ్ర చాపు
పల్లవి:
నన్ను బ్రోవు లలితా వేగమే చాల
నిన్ను నెఱ నమ్మియున్న వాడగదా భక్త కల్పకలతా॥
అను పల్లవి:
నినువినా ఎవరున్నారు గతి జననీ అతి వేగమే వచ్చి॥
చరణము(లు):
పరాకు సేయకనేవచ్చి కృపసలుప రాదా మొఱ వినవా
పరాశక్తి గీర్వాణ వందితపాద నీ భక్తుడనమ్మా సంతతము॥
సరోజభవ కమలనాథ శంకరసురేంద్ర నుతచరితా
పురాణి వాణీ ఇంద్రాణీ వందిత రాణి అహిభూషణుని రాణీ॥
మదాత్ములైన దురాత్మజనులను కథలను పొగడి
సదా నే వరాల చుట్టి తిరిగితి వెతలనెల్ల దీర్చివరమొసగి॥
సుమేరు మధ్య నిలయే శ్యామకృష్ణుని సోదరి కౌమారి
ఉమా శ్రీ మీనాక్షమ్మా శంకరీ ఓ మహారాజ్ఞీ రక్షించుట కిది సమయము॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - nannu brOvu lalitA vEgamE chAla