కీర్తనలు శ్యామా శాస్త్రి నిన్ను వినాగా మరి దిక్కెవరున్నారు
పూర్వికల్యాణి - మిశ్ర చాపు
పల్లవి:
నిన్ను వినాగా మరి దిక్కెవరున్నారు నిఖిలలోకజనని నన్ను బ్రోచుటకు॥
అను పల్లవి:
పన్నగభూషణుడైన కాంచి ఏకామ్ర పతిమనోహారిణి శ్రీ కామాక్షి॥
చరణము(లు):
పరమలోభులను పొగడి పొగడి అతి పామరుడై తిరిగి తిరిగి వేసారి
స్థిరములేకనతి చపలుడైతి నా చింతదీర్చి వేగమే బ్రోచుటకు॥
ఇలలో నీవలే గాదా నీ మహిమ ఎంతని యోచింప ఎవ్వరి తరమా
పలుక వశమా ఆది శేషునికైనను పతితపావని నన్ను బ్రోచుటకు॥
తామసంబిటుల సేయరాదికను తల్లి నా మొఱ వినరాదా దయలేదా
కామితార్థ ఫలదాయకి నీవే గదా శ్యామకృష్ణ సహోదరి బ్రోచుటకు॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - ninnu vinAgA mari dikkevarunnAru