కీర్తనలు శ్యామా శాస్త్రి నిన్ను వినా మఱిగలదా గతి లోకములో
ఆభేరి - రూపక (రీతిగౌళ -)
పల్లవి:
నిన్ను వినా మఱిగలదా గతి లోకములో
నిరంజని నిఖిలజనని మృడాని భవాని అంబ॥
అను పల్లవి:
పన్నగభూషణుని రాణి పార్వతి జనని అంబ
పరాకు సేయక రాదు విను శ్రీ బృహదంబ వినుము॥
చరణము(లు):
పామరునమ్మా దయచేసి వరమీయమ్మా
మాయమ్మా పాపమెల్ల పరిహరించి బిరాన బ్రోచుటకు॥
సారములేని భవ జలధి తగులు కొని
చాల వేసారితిని నా విచారము దీర్చుటకు॥
నా మదిలో అంబ నీవే గతియని నమ్మితి
శ్యామకృష్ణనుతా భక్తపరిపాలనము సేయుటకు॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - ninnu vinA maRigaladA gati lOkamulO