కీర్తనలు శ్యామా శాస్త్రి నిన్నే నమ్మినాను సదా నా
తోడి - త్రిపుట ( - మిశ్ర చాపు)
పల్లవి:
నిన్నే నమ్మినాను సదా నా
విన్నపము విని నన్ను బ్రోవుము॥
అను పల్లవి:
కన్నతల్లి గదా బిడ్డయని కనికరమింతైన లేదా
పన్నగధరుని రాణి శుకపాణి కామాక్షి కల్యాణి॥
చరణము(లు):
వేగమె వచ్చి నాదు కోర్కెలీవే పరాముఖమేల
భోగీంద్రసన్నుత పూతచరితా పురుహూతపూజితా పరదేవతే॥
ధ్యానమే వినగ మంత్ర తంత్రమేమిలెరుగనే
గానవినోదినీ నీదు సాటి జగాన గాననే బంగారు బొమ్మా॥
శ్యామకృష్ణ సహోదరీ భక్త కామితార్థ ఫలదాయకీ
కామాక్షీ కంజదళాయతాక్షి కారుణ్యమూర్తి గదా నీవే సంపద॥
స్వరము(లు):
నీ మహిమవిని మదిలో నీవే గతియనుచును కోరితి
కమలభవ దనుజరిపునుత పదకమలయుగ సమయమిదే బ్రోవుము॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - ninnE namminAnu sadA nA