కీర్తనలు శ్యామా శాస్త్రి నీలాయతాక్షీ నీవే జగత్సాక్షి
పరజు - త్రిపుట (మాయామాళవగౌళ - )
పల్లవి:
నీలాయతాక్షీ నీవే జగత్సాక్షి॥
అను పల్లవి:
ఫాలాక్షుని రాణీ పాలితాశ్రిత శ్రేణి॥
చరణము(లు):
దీనరక్షకీ అభయదానమీయవే సామ
గానలోలే అభిమానమీయవే దేవీ॥
ఆదిశక్తి కౌమారీ మేదినిలో నిన్ను పొగడ
ఆదిశేషునికైన రాదిక నేమి జెప్పుదు దేవి॥
కామపాలిని విను నీ నామములే ధర్మార్థ
కామమోక్షమిచ్చేది శ్యామకృష్ణపాలినీ దేవీ॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - nIlAyatAkShI nIvE jagatsAkShi