కీర్తనలు శ్యామా శాస్త్రి నీవే గతియని (వర్ణమ్‌)
కల్యాణి - తిశ్ర మఠ్యమ్‌
పల్లవి:
నీవే గతియని నెర నమ్మినాను జగదంబ నీవనాథరక్షకి మాయమ్మా॥
అను పల్లవి:
రావే వేగమే మనవి వినమ్మా శ్రీరాజరాజేశ్వరీ దేవీ॥
చరణము(లు):
కామకోటి పీఠనివాసిని కల్యాణిశ్యామకృష్ణసోదరి దేవి
నీదు చరితము వినివిని పాదకమలమును కోరితిని సదా గతియని
పొగడి పొగడి శరణము గొలిచేనమ్మా బంగారు కామాక్షి॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - nIvE gatiyani (varNam)