కీర్తనలు శ్యామా శాస్త్రి పరాకేల నన్ను పరిపాలింప మురారి సోదరి అంబా
కేదారగౌళ - ఆది
పల్లవి:
పరాకేల నన్ను పరిపాలింప మురారి సోదరి అంబా॥
అను పల్లవి:
నిరాదరణ సేయ రాదమ్మా శివే పరాశక్తి నా మొఱ నాలకింప॥
చరణము(లు):
ధరాద్యఖిలమునకు రాణి హరి హరాదుల పొగడు పరాత్పరి
దురంత మహిషాసుర దమని స్మరాధీనుడౌ శ్యామకృష్ణనుత॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - parAkEla nannu paripAliMpa murAri sOdari aMbA