కీర్తనలు శ్యామా శాస్త్రి పార్వతీ నిన్ను నే నెఱనమ్మితి
కల్గడ - ఆది, తిశ్ర గతి
పల్లవి:
పార్వతీ నిన్ను నే నెఱనమ్మితి
శుకపాణి బ్రోవు పరాకికనేల సుశీలే॥
అను పల్లవి:
గీర్వాణ వందిత పదసారస సంగీతలోలే
సుగుణజాలే జాలమేలే కామాక్షీ॥
చరణము(లు):
భండదైత్య ఖండనాఖండల వినుతా మా
ర్తాండ కోటితేజ నీరజాక్షి నిఖిలసాక్షి॥
ఇందువదనా కుందరదనా సింధురగమనా మక
రంద వాణీ నీలమేఘవేణీ గీర్వాణీ॥
శ్యామకృష్ణ సోదరీ శివశంకరీ గౌరీ గుణ
ధామ కామపీఠవాసినీ శాంభవీ మృడానీ॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - pArvatI ninnu nE neRanammiti