కీర్తనలు శ్యామా శాస్త్రి పాలించు కామాక్షి పావనీ పాపశమనీ అంబ
మధ్యమావతి - ఆది
పల్లవి:
పాలించు కామాక్షి పావనీ పాపశమనీ అంబ॥
అను పల్లవి:
చాల బహువిధముగా నిన్ను సదా వేడుకొనేడి నా యందేల
ఈలాగు జేసేవు వెత హరించవే వేగమే నన్ను॥
చరణము(లు):
స్వాంతంబులోన నిన్నే దలచిన సుజనులకెల్ల నీవేళ
సంతోషములొసగేవని నీవు మనోరథ ఫలదాయిని వని
కాంతమగు పేరు పొందితివి కారుణ్యమూర్తివై జగము
కాపాడిన తల్లి గదా నేను నీదు బిడ్డను లాలించి॥
ఈ మూర్తి ఇంత తేజోమయమై యిటువలే కీర్తి విస్ఫూర్తి
నిట్లను గుణమూర్తి త్రిలోకములో జూచినా ఎందైన గలదా
ఏమో తొలి నోము నోచితినో నీ పాదపద్మ దర్శనము
వేమారు లభించి కృతార్థుడనైతి నా మనవినాలకించి॥
రాజాధి రాజన్మకుటీతట మణిరాజపాదా
నే జాల నిజసన్నిధిని కోరి సమస్తజనులకెల్ల వరదా
రాజముఖీ శ్యామకృష్ణనుతా కాంచీపురేశ్వరీ వికస
రాజీవదళాక్షీ జగత్సాక్షీ ఓ ప్రసన్న పరాశక్తీ॥
స్వరము(లు):
కనకగిరిసదన లలిత నిను భజన సంతతము సేయ నిజముగను
వినుము నిఖిల భువనజననివని యిపుడు మా దురితము దీర్చి వరాలిచ్చి॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - pAliMchu kAmAkShi pAvanI pApashamanI aMba