కీర్తనలు శ్యామా శాస్త్రి పాలింపవమ్మా పరమపావనీ భవానీ
ముఖారి - ఆది
పల్లవి:
పాలింపవమ్మా పరమపావనీ భవానీ॥
అను పల్లవి:
శ్రీ లలితా గుణశీలములను విని చాల నీ సేవజేయ కోరి వచ్చితి॥
చరణము(లు):
నీ సమానదైవము నేగాన నిఖిలలోకజననీ మాయమ్మా
శ్రీ స్వయంభునాథ తరుణీ మధురవాణీ నీ దాసుని బ్రోవ ఇంత పరాకేలనమ్మా॥
నా తాపము దీర్చి ప్రేమజూచి నిదానముగ మాట్లాడ సమయమిదే
గదా జెప్పవమ్మా మాయమ్మా సదా నీ జపమే గతియని నమ్మినానమ్మా॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - pAliMpavammA paramapAvanI bhavAnI