కీర్తనలు శ్యామా శాస్త్రి పాహి శ్రీ గిరిరాజసుతే కరుణాకలితే
ఆనందభైరవి - రూపకం
పల్లవి:
పాహి శ్రీ గిరిరాజసుతే కరుణాకలితే
పదసరోజ మనుసరామి తే అంబ॥
అను పల్లవి:
దేహి మతేరనుపమగతిం మే అంబ ఏకామ్రపతిసుదతి సతి
తేజసా అతులిత దివ్యమూర్తే లలితే సులలితే॥
చరణము(లు):
దేవి పురాణి నిగమవినుతే ప్రీతిరిహ వసతు తే
మానదే అనుదినమజితే యుధి జితేంద్ర విమతే
దేవావిరత కృత నుతే కామకోటిపీఠ గతే
దీనజన నికరే భువి పరదేవతే సుచరితే॥
నీపవనీ పరమనివసనే నమ్ర జగదవన
నేత్రి జనని కనకవసనే ఝషవిశాలనయనే
గోపయిత సుకవిజనే పాప తాప ఖండన నిపుణే
కుంతల విజిత ఘనే ఘనజఘనే కలావతి రతే॥
కామితధాత్రి కమలముఖి కామాక్షి అఖిలసాక్షి
కామరతి కామ శుభఫలదే ధృత సుగంధ ఘనలతే
శ్యామే అద్య భవ మమ ముదే శ్యామకృష్ణ సద్వరదే
శ్యామళే ఆశ్రితరతే విదితగతే సదా ఇహ వరదే॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - pAhi shrI girirAjasutE karuNAkalitE