కీర్తనలు శ్యామా శాస్త్రి బిరాన వరాలిచ్చి బ్రోవుము నెఱ నమ్మితి
కల్యాణి - రూపకం
పల్లవి:
బిరాన వరాలిచ్చి బ్రోవుము నెఱ నమ్మితి॥
అను పల్లవి:
పురారి మనోహారిణీ శ్రీ కామాక్షి॥
చరణము(లు):
తామసము సేయక నీవు కరుణానిధి గాదా
పరాముఖమికనేల విను సరోజముఖి॥
కామితార్థఫల దాయకి దేవి కల్పలతికా
పురాణి మధురవాణి శివునికి రాణి॥
శ్యామకృష్ణ సోదరి గౌరి పరమేశ్వరి గిరిజా
అనాథ రక్షణంబు సలుపగ రావే॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - birAna varAlichchi brOvumu neRa nammiti