కీర్తనలు శ్యామా శాస్త్రి బ్రోవ సమయమిదే దేవీ విను
పున్నాగవరాళి - ఆది
పల్లవి:
బ్రోవ సమయమిదే దేవీ విను
దేవరాజనుతా పరదేవతా అంబా॥
అను పల్లవి:
భావజారి రాణీ భక్తపాలినీ భవానీ బృహదంబా నను॥
చరణము(లు):
అంబుజదళనయనా విధు బింబనిభాననా గజగమనా
అంబికే పరాకుసేయతగునా బింబాధరీ గౌరీ కుందరదనా॥
అంబరచరవినుతా కదంబవనప్రియా శ్రీ లలితా
కంబుగళా వరదాననిరతా తుంబురు నారదనుతా సంగీతరదా॥
శ్యామగిరితనయా గుణధామ కరధృతమణి వలయా
సోమకలాధరి శివప్రియా శ్యామకృష్ణహృదయాంబుజనిలయా॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - brOva samayamidE dEvI vinu