కీర్తనలు శ్యామా శాస్త్రి బ్రోవవమ్మా తామసమేలే బిరాన
మాంజి - మిశ్ర చాపు
పల్లవి:
బ్రోవవమ్మా తామసమేలే బిరాన
బ్రోవవమ్మా తామసమేలే అంబా దేవీ తాళలేనే బిరాన॥
అను పల్లవి:
నీవే అనాదరణ జేసితే అంబా నిర్వహింప వశమా కామాక్షి॥
చరణము(లు):
జాలమేల వినోదమా శివశంకరి ఇది సమ్మతమా
శూలినీ నీవే భక్త పరిపాలినీ గదా బిరాన॥
దీనరక్షకి నీవేయని నీ దివ్యనామమే ధ్యానము
వేరే మంత్ర జప తపములెరుగనే బిరాన\॥
శ్యామకృష్ణ సహోదరీ శుకశ్యామళే త్రిపుర సుందరి అంబా
ఈ మహిలో నీ సమాన దైవము నెందుగానలేనే బిరాన॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - brOvavammA tAmasamElE birAna