కీర్తనలు శ్యామా శాస్త్రి మాయమ్మా నన్నుబ్రోవవమ్మా మహామాయా ఉమా
నాటకురంజి - ఆది
పల్లవి:
మాయమ్మా నన్నుబ్రోవవమ్మా మహామాయా ఉమా॥
అను పల్లవి:
సత్యానందా సానందా నిత్యానందా ఆనందా అంబా॥
చరణము(లు):
శ్యామకృష్ణజననీ తామసమేల రావే దేవీ
శ్యామలే నీలోత్పలే హిమాచలసుతే సుఫలే శివే॥
స్వరము(లు):
మాధవాదివినుతే సరసిజాక్షి కంచికామాక్షి తామసము సేయక
రమ్మా మరకతాంగి మహాత్రిపురసుందరి నిన్నే హృదయము పట్టుకొని॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - mAyammA nannubrOvavammA mahAmAyA umA