కీర్తనలు శ్యామా శాస్త్రి మాయమ్మా యని నే పిలిచితే
ఆహిరి - ఆది
పల్లవి:
మాయమ్మా యని నే పిలిచితే మాట్లాడరాదా నాతో అంబా॥
అను పల్లవి:
న్యాయమా శ్రీ మీనాక్షి నీకిది నిన్నువినా వేరే దిక్కెవరున్నారు॥
చరణము(లు):
సరసిజభవ హరిహర నుత సులలిత నీ పదపంకజముల
స్థిరమని నమ్మితి నమ్మితి నమ్మితిని
కరుణజూడవే కాత్యాయని కాళికా భవాని
పరమేశ్వరి సుందరేశు రాణి బాలాంబా మధురవాణి॥
వినుతజన పాపవిమోచని ఓ జనని ఘన నీలవేణి
విదళిత దానవ మండల దమని
వనజలోచనా సుధాకరాననా వరదాయకి
అనయము నిన్ను కోరియున్నానమ్మా బంగారు బొమ్మా॥
అభయమొసగి నన్ను బ్రోవుము ఓ వరదా నెఱదాతవు గదా
అంబికా బిడ్డపై గొప్పగ దయ రాదా
అఖిలలోకజనని అనాథరక్షకి అనేటి బిరుదు గాదా
వైభవముగల శ్యామకృష్ణసోదరి వీరశక్తి త్రిపురసుందరి॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - mAyammA yani nE pilichitE