కీర్తనలు శ్యామా శాస్త్రి మీనలోచని బ్రోవయోచనా దీనజనావనా
ధన్యాసి - మిశ్ర చాపు
పల్లవి:
మీనలోచని బ్రోవయోచనా దీనజనావనా అంబా॥
అను పల్లవి:
గానవినోదిని నీ సమానము జగాన గాననమ్మ అంబ॥
చరణము(లు):
కన్నతల్లి గదా నా విన్నపము వినవమ్మా పన్నగభూషణునికి రాణీ
నిన్నువినా ఇలలో దాత వేరెవరున్నారమ్మా బంగారు బొమ్మా॥
ఇందుముఖీ నీవు వరములొసగి నాముందువచ్చి దయసేయవమ్మా
కుంద ముకుందరదనా హిమగిరికుమారీ కౌమారీ పరమేశ్వరీ॥
సామజగమనా నీవు తామసము సేయక శ్యామకృష్ణసోదరీ రావే
కామపాలినీ భవానీ చంద్ర కలాధారిణీ నీరదవేణీ॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - mInalOchani brOvayOchanA dInajanAvanA