కీర్తనలు శ్యామా శాస్త్రి రావే పర్వతరాజకుమారీ దేవీ నన్నుబ్రోచుటకు వే వేగమే
కల్యాణి - ఝంప
పల్లవి:
రావే పర్వతరాజకుమారీ దేవీ నన్నుబ్రోచుటకు వే వేగమే॥
అను పల్లవి:
నీవే గతియని నమ్మియుంటి గదా నా మొఱలిడగా జెప్పవమ్మా మా తల్లి॥
చరణము(లు):
ధీర కుమార వందితపదా నీరదవేణి త్రిలోకజనని నీను గదా
నారదాదినుత శుభచరితా ఉదార గుణవతీ పదాంబుజములే శరణంటి॥
మీనలోచనీ కృపజూడవమ్మా దీనరక్షకియని బిరుదు నీకు తగు
దానవరిపుతోషిణి పురాణీ అభయ దానమీయవే శ్యామకృష్ణసోదరీ॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - rAvE parvatarAjakumArI dEvI nannubrOchuTaku vE vEgamE