కీర్తనలు శ్యామా శాస్త్రి శంకరి శంకరి కరుణాకరి రాజరాజేశ్వరి
కల్యాణి - ఆట
పల్లవి:
శంకరి శంకరి కరుణాకరి రాజరాజేశ్వరి
సుందరి పరాత్పరి గౌరి అంబ॥
అను పల్లవి:
పంకజదళనేత్రి గిరిరాజకుమారి
పరమపావని భవాని సదాశివ కుటుంబిని॥
చరణము(లు):
శ్యామకృష్ణసోదరి శిశుం మాం పరిపాలయ శంకరి
కరిముఖ కుమార జనని కాత్యాయని కల్యాణి
సర్వచిత్తబోధిని తత్వజ్ఞానరూపిణి
సర్వలోకాధీశే మంగళమ్‌ జయ మంగళమ్‌ శుభ మంగళమ్‌॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - shaMkari shaMkari karuNAkari rAjarAjEshvari