కీర్తనలు శ్యామా శాస్త్రి శ్రీ కామాక్షి కావవే నను కరుణాకటాక్షి
కల్యాణి - ఆది
పల్లవి:
శ్రీ కామాక్షి కావవే నను కరుణాకటాక్షి
శ్రీ కాంతిమతీ శ్రీ కాంచీపురవాసినీ॥
అను పల్లవి:
ఏకామ్రేశ్వరి నీకు ఏలాకు దయవచ్చునో
లోకులు కోరిన దైవము నీవే గాదా
ఏకభావుడైన నన్నొకని బ్రోవ బరువా॥
చరణము(లు):
కోరివచ్చిన భక్తజనులకు కోమళాంగి నీవే సామ్రాజ్యము
కామాక్షమ్మా నిన్నే వేడిన బిడ్డను కాపాడవమ్మా కరుణజూడవమ్మా
సారసదళనేత్రీ కామపాలినీ సోమశేఖరుని రాణీ పురాణీ
శ్యామళాంబికే కాళికే కలే సామగానమోదినీ జననీ॥
నీరజలోచనా స్థిరమని భక్తితో నిన్నే శరణంటిన దాసుడు నేను
నీ సన్నిధిని జేరిన నాపై నిరీక్షణము చేయ తగునా
నీ నామమే ధ్యానమే నియతి వేరే జపతపము లెరుగనే మాయమ్మా
నీ సాటెవరు శ్యామళే శివే శ్యామకృష్ణపాలిత జననీ॥
స్వరము(లు):
నా మనవి వినుమిక గిరితనయా ముదముతో వచ్చి కోరితి
నా వెతలను దీర్చవే మాకభయదానమీయవే తామసము సేయకనే॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - shrI kAmAxi kAvavE nanu karuNAkaTAxi