కీర్తనలు శ్యామా శాస్త్రి సరోజదళనేత్రి హిమగిరిపుత్రి నీ పదాంబుజములే
శంకరాభరణ - ఆది
పల్లవి:
సరోజదళనేత్రి హిమగిరిపుత్రి నీ పదాంబుజములే
సదా నమ్మినానమ్మా శుభమిమ్మా శ్రీ మీనాక్షమ్మా॥
అను పల్లవి:
పరాకు సేయక వరదాయకి నీవలే దైవము లోకములో గలదా
పురాణీ శుకపాణీ మధు కరవేణీ సదాశివునికి రాణీ॥
చరణము(లు):
కోరివచ్చిన వారికెల్లను కోర్కలొసగే బిరుదుగదా అతి
భారమా నన్ను బ్రోవ తల్లి కృపాలవాల తాళజాలనే॥
ఇందుముఖి కరుణించమని నిన్నెంతో వేడుకొంటిని నా
యందు జాగేలనమ్మా మరియాద గాదు దయావతి నీవు॥
సామగాన వినోదినీ గుణ ధామ శ్యామకృష్ణ నుతా శుక
శ్యామళాదేవి నీవేగతి రతి కామ కామ్యద కావవే నన్ను॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - sarOjadaLanEtri himagiriputri nI padAMbujamulE