కీర్తనలు శ్యామా శాస్త్రి నన్ను బ్రోవరాదా వేగమే నీవు
గౌళిపంతు - మిశ్ర చాపు
పల్లవి:
నన్ను బ్రోవరాదా వేగమే నీవు॥
అను పల్లవి:
విను నామొఱలను నే నీదాసుడు గాదా॥
చరణము(లు):
కోరిన వరమిచ్చే దైవము నీవే గాదా? కారుణ్యమూర్తి కౌమారీ గౌరీ
శరణాగత జనరక్షకీ శంకరీ సరస మృదుభాషిణీ రాజరాజేశ్వరీ॥
అభయదానమిచ్చే దైవము నీవే గదా అభిరామ గుణమయీ అఖిలాండేశ్వరీ
ఆశ్రిత తాపహారిణీ పురాణీ ఆనంద రూపిణీ అళికులవేణీ॥
కామితఫలమిచ్చే దైవము నీవే గదా? పామరపాలినీ భవభయ భంజనీ
సోమశేఖర ప్రియ భామినీ రంజనీ శ్యామకృష్ణసోదరి పార్వతి భవాని॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - nannu brOvarAdA vEgamE nIvu