కీర్తనలు శ్యామా శాస్త్రి పురహరజాయే పాలయ మాం
గౌళిపంతు - మిశ్ర చాపు
పల్లవి:
పురహరజాయే పాలయ మాం॥
అను పల్లవి:
చరణాంబుజభక్తిం దేహి మే కరుణానిధే నిరామయే మాయే॥
చరణము(లు):
అళికులవేణి భవాని పావని కళరవ మృదుతరవాణి శర్వాణి
కలిమోచని బాలే కమనీయగుణశీలే తిలకాంచితఫాలే ధృతమణిమాలే॥
భానుకోటి సమాన శరీరే పాలిత ముని నికరే గంభీరే
దీనజనపోషిణి నతసుతతోషిణి దైత్యకులశోషిణి సులభే మంజుభాషిణి॥
కామపీఠగతే కల్యాణి కామాక్షి కామితఫలదే శ్రీ లలితే
సోమముఖి పురాణి సుందరి కౌమారి శ్యామకృష్ణసోదరి శైలరాజకుమారి॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - puraharajAyE pAlaya mAM