కీర్తనలు శ్యామా శాస్త్రి దయజూడ మంచి సమయమిదే వే వేగమే వచ్చి
జగన్మోహిని - మిశ్ర చాపు
పల్లవి:
దయజూడ మంచి సమయమిదే వే వేగమే వచ్చి॥
అను పల్లవి:
జయమొసగే శంకరీ నీవు జననిగదా బృహదంబా॥
చరణము(లు):
కనకాంగీ నీ పాదకమలమే దిక్కని నమ్మినాను నేను
సనకసనందన వందిత చరణా సారసనేత్రి నీవు గదా॥
చపలమన్యు దీర్చ్యఖండసామ్రాజ్యమీయవే
కపటము సేయకనే నిగమవినుతా కామిత దాయకి నీవుగదా॥
శ్యామకృష్ణ సోదరీ కౌమారీ సకలాగమపూజితే దేవి
నీ మహిమలు పొగడ తరమా నీ సమాన మెందుగాననే॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - dayajUDa maMchi samayamidE vE vEgamE vachchi