కీర్తనలు శ్యామా శాస్త్రి కామాక్షి కరుణాకటాక్షి (గీతమ్‌)
పరజు - త్రిపుట
1: కామాక్షి కరుణాకటాక్షి కామాక్షి లోక సాక్షిణి
కామాక్షి కరుణాకటాక్షి కామాక్షి మాం పాహి బంగారు॥
2: కామకోటి పీఠగతే కామితఫలదాయికే
కామాక్షి మాం పాహి కంచికామాక్షి మాం పాహి॥
3: పంకజదళలోచనే సంకటభయమోచనే
శంకరి మాం పాహి శివ శంకరి మాం పాహి॥
4: శ్యామకృష్ణపాలితజనని సామగానవినోదిని
శ్యామళే మాం పాహి శుకశ్యామళే మాం పాహి॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - kAmAkShi karuNAkaTAkShi (gItam)