కీర్తనలు శ్యామా శాస్త్రి శ్రీపతిముఖ విరచిత పూజ్యే
సావేరి - ఆది
పల్లవి:
శ్రీపతిముఖ విరచిత పూజ్యే
శ్రీ పార్వతి మాం పాహి దేవి॥
అను పల్లవి:
నీపవననిలయే నిరామయే నిటిలనయనజాయే మమ హృదయ
తాపహారిణి నవరత్నాలయే తాపస వరనారదముదితే దేవి॥
చరణము(లు):
తరుణి లతాపల్లవ మృదుచరణే తపన విధువిలోచనే
అరుణకోటిసమకాంతియుత శరీరే కలధృతకలాపే
సురుచిరమణికంఠలసన్మణిహారే సుగుణశీలే సతతం సముదం
కరుణయా అవ దీనం పరదేవతే కామకోటిపీఠగతే లలితే॥
కరిముఖ కార్తికేయ జనని స్వరపాలిని పావని
హరిసహోదరి విదళిత దైత్యారిగణే సదా పూర్ణే
పరమేశవినుతే శ్రితజనపాలితే ప్రీతిరిహ వసతు విమలే
పురహరప్రియే శశినిభాననే పూర్ణకామే సామగానలోలే॥
శ్యామళాంగి మంజుళవాణి సకలభయనివారిణి
హే మహేశ్వరి మధుపసదృశవేణి కామేశ్వరి గౌరి
శ్యామకృష్ణసోదరి భువనేశ్వరి శాంభవి మహాత్రిపుర సుందరి
హిమగిరికుమారి కవికుల కామదే కాంక్షిత ఫలదాయికే॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - shrIpatimukha virachita pUjyE