కీర్తనలు శ్యామా శాస్త్రి నామనవిని విను ఈ వేళ(వర్ణమ్‌)
సౌరాష్ట్రం - చతురశ్ర అట
పల్లవి:
నామనవిని విను ఈ వేళ బ్రోవు కంచి కామాక్షమ్మా
పామరపాలినీ ఓ జననీ కృప జూడ వమ్మా॥
అను పల్లవి:
నెమ్మదిని నీ నామమే దిక్కని నిన్నే
నమ్మితి నమ్మితి నమ్మితినమ్మా మాయమ్మా॥
స్వరము(లు):
పాదకమలములపై గతియని నీ సన్నిధిని వచ్చిన దాసున నన్ను
చనువున రక్షించుటకు పరుల ఈ ధరలో తెలిసి తెలియక జేసిన
అపరాధములను మన్నించి నీవు మా దురితము దీర్చి దయజూచిపుడు
నా మనవిని విను ఈ వేళ బ్రోవు కంచి కామాక్షమ్మా॥
చరణము(లు):
భక్తుడైన నాపై ఇంత వాదా మాయమ్మా
ముక్తినీయవే శ్యామ కృష్ణనుతా అంబా॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - nAmanavini vinu I vELa(varNam)