కీర్తనలు శ్యామా శాస్త్రి ఆదినమునించి పొగడి పొగడి ఆశ్రయించి
ఆనందభైరవి - త్రిపుట
పల్లవి:
ఆదినమునించి పొగడి పొగడి ఆశ్రయించి
నీమహిమలను పాడలేదా?
అను పల్లవి:
ఆదిశక్తి నీవని నమ్మినాను నమ్మిన
నన్ను ఆదరించలేవా దయలేదా?
చరణము(లు):
అహిభూషణుని రాణీ పురాణీ భవానీ అళికులవేణీ
ఆశ్రిత శ్రేణీ అంబుజలోచని శ్యామకృష్ణపాలితజననీ
అఖిలలోకభవానీ శ్యామళాంబికే వరదే అభయదానమీయవే॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - AdinamuniMchi pogaDi pogaDi AshrayiMchi