| కీర్తనలు | శ్యామా శాస్త్రి | మహిలో అంబా నీదు మహిమాతిశయమెన్న తరమా? |
| ఆనందభైరవి - ఆది |
| పల్లవి: |
| మహిలో అంబా నీదు మహిమాతిశయమెన్న తరమా? |
| అను పల్లవి: |
| అహి భూషణుని రాణి శంకరి అంబికా బృహన్నాయకి గౌరీ॥ |
| చరణము(లు): |
| సారసదళనయన వదనసరోజ విజితా ఘనపురారివై రాణి వరాలొసగింపవే బిరాన బ్రోచిన పరాశక్తి గదా॥ |
| సుమేరుమధ్యలతా లలితా రమించు విను నే కుమారుడ నను చు మాతల్లి నీవు మానవతి నీసమానమెవరు ఇలలో జెప్పవమ్మా॥ |
| సామగాననుతా సరసపదా తామసము జేసే తాళనే శ్యామకృష్ణ సోదరి శంకరి శ్యామళాంబా నీవే మాయమ్మా॥ |