| కీర్తనలు | శ్యామా శాస్త్రి | సామిని రమ్మనవే (వర్ణమ్) |
| ఆనందభైరవి - ఆట |
| పల్లవి: |
| సామిని రమ్మనవే సారసాక్షీ ఈ వేళ॥ |
| అను పల్లవి: |
| కామునిగన్న మాకాంచీవాసుడైన శ్రీ వరదరాజుని॥ |
| మూల స్వరము: |
| సరసజేరి సమరతుల మేటి యుపరతులచే నెనగ గరిమ మీరగను ఘనము జేయుచును తళిరుబోని భళమానిని వినవే సారసనయన శభాసు వరసుగుణ సామజగమన విశాలజఘన సాటెవరు ధరను నీ సరిగ నేనటు గారవముగల॥ |
| చరణము(లు): |
| మారుని బాణములు వేమారు॥ |
| స్వరము(లు): |
| పాటియనిమది చలముగొని సరోజ సరముల సారెకు ఘనకుచములదర వరాళిగముల విరాళింగలగ నీసుకోనునల॥ |
| మామగు నలసోముని కాకల కవరి సామిందలచి నిరతమును నే విరహ వేదనన్వేసరింప నీ తరిని ఈలాగునను॥ |
| నెలతలగుములు నీటులనలరి గొలువగ సదా మదాళులగముల్ కరకరి మ్రోయగను ఈ రసముగా మదిని తా దలచి సాహసమున మీరి ఘనరోసమున శుకాళి పికసేనలను తా దలచి మానకను సామోదమున మాయగొని ఈ సమయమున॥ |
| చరణము - అనుబంధము: |
| మారుని బాణములు వేమారునే తాళగలేను కూరిమితో నన్నేలిన గుణవంతుడైన శ్రీ వరదరాజ॥ |