కీర్తనలు శ్యామా శాస్త్రి అఖిలాండేశ్వరి దురుసుగ బ్రోవుము
కర్ణాటక కాపి - ఆది
పల్లవి:
అఖిలాండేశ్వరి దురుసుగ బ్రోవుము
అను పల్లవి:
నిఖిలతాపహారిణీ భువిలోన నినుమించిన వారెవరున్నారమ్మా
చరణము(లు):
మాణిక్య మయమై యున్న మందిరమధ్యవాసినీ అలి
వేణీ శ్రీ శంభునాథుని రాణీ వరమీయవే గీర్వాణీ మాయమ్మా
అంభోరుహసంభవ హరి శంకర అఖిలమునీంద్రపూజిత అతి
గంభీరా దీనరక్షణి గదా నామొఱలను వినలేదా?
ఓ అంబా నిను నమ్మిన నాపై ఇంత పరాముఖమేల విను
శ్యామకృష్ణనుతా చింత దీర్చి సామ్రాజ్యమీయవే వేగమే
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - akhilAMDEshvari durusuga brOvumu