కీర్తనలు శ్యామా శాస్త్రి కామాక్షి లోకసాక్షిణీ (గీతమ్‌)
మధ్యమావతి - త్రిపుట
1: కామాక్షి లోకసాక్షిణీ కామారి మనోహారిణీ
కామాక్షి కంచికామాక్షి పాహిమామ్‌ పాహిమామ్‌ బంగారు పాహి॥
2: పంకజదళలోచనే ఉమే సంకట భయమోచనే శివే
కుంజర సమగమనే రమణే మంజుళతమ నయనే హరిణి॥
3: భండ దైత్య ఖండన పండితే అండజ హరి గిరీశ మండితే
పుండరీక మృదుపదయుగళే మండలస్థితే లలితే వరదే॥
4: కామకోటి పీఠవాసినీ కామితార్థ శుభఫలదాయికే
సామగాన శ్రుతి సమ్మోదిని శ్యామకృష్ణ పాలిత జనని॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - kAmAkShi lOkasAkShiNI (gItam)