కీర్తనలు శ్యామా శాస్త్రి నిన్నే నమ్మితి నిజముగ గతి లోకములో
కేదారగౌళ - ఆది
పల్లవి:
నిన్నే నమ్మితి నిజముగ గతి లోకములో॥
అను పల్లవి:
నన్నడ చలుపగ నావిచారము దీర్చి
నంబోరుహాననా దివ్యతర జూచి॥
చరణము(లు):
నీ మహాత్మ్యము ఎవరే నిదానింప శక్యము గాదుగదా
శ్రీ మాతవే నీ ఛాయేతులనొకని గాంచగలనే
ఏమని చెప్పుదు దేవీ నుతింప నాదువశమా
ఈ మహిలో నీ దయగలిగినా భయంబు తొలిగేనో॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - ninnE nammiti nijamuga gati lOkamulO