కీర్తనలు శ్యామా శాస్త్రి బృహన్నాయకీ నన్ను బ్రోవు వేగమే
మధ్యమావతి - తిశ్ర మఠ్యమ్‌
పల్లవి:
బృహన్నాయకీ నన్ను బ్రోవు వేగమే॥
అను పల్లవి:
బృహదంబా నీ మహిమలు బ్రహ్మాది సురులచే పొగడతరమా?
చరణము(లు):
దేవీ నీవే గతియని అంబా దృఢ భక్తితో పూజించే గదా
నా వెత దీర్చవే కరుణజూడ సమయమిదే నీపాదమే గతియనుచు నెఱనమ్మితి॥
దీనరక్షకి నీవని సదా దలచిన దాసుడు నేనుగదా మాకభయ
దానమీయవే కామితదాయికే నీ నామమే అనుదినము మఱవకను॥
శ్యామకృష్ణపాలిని గౌరి సులలితే శ్యామళే నాతోవాదా మాయమ్మా
ఈ మహిలో నీసమాన దైవమెవరు ఈ వేళను దురముగను వరమొసగు॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - bR^ihannAyakI nannu brOvu vEgamE