కీర్తనలు శ్యామా శాస్త్రి బ్రోవవమ్మా బంగారు బొమ్మా మాయమ్మా నను
నీలాంబరి - మిశ్ర చాపు
పల్లవి:
బ్రోవవమ్మా బంగారు బొమ్మా మాయమ్మా నను॥
అను పల్లవి:
బ్రోవవమ్మా నాతో మాట్లాడవమ్మా
సార్వభౌమ బొమ్మా కామాక్షమ్మా నను॥
చరణము(లు):
శ్యామకృష్ణపూజితా సులలితా శ్యామళాంబా ఏకామ్రేశ్వరప్రియా
తామసము సేయకనే కామాక్షమ్మా మాయమ్మా
తామసము సేయకనే పరితాపములను పరిహరించి నను॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - brOvavammA baMgAru bommA mAyammA nanu